Tags

, ,

Munemma - Dr. Kesava Reddy

అడుగుదాం. సమయమొచ్చినప్పుడు గొంతుమీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్లలో మునిగినప్పుడు కదా గాలాన్ని లాగుతాం.
….మునెమ్మ

మనం సాధించదలచుకున్నది ధర్మసమ్మతమైనదైతే దాన్ని పొందడానికి మనకు యోగ్యత వుంటే, దానికోసం సాగే ప్రయత్నం నిజాయితీగా సాగితే దాన్ని సాధించే తీరుతాం. ఏ అమావాస్యగానీ, పౌర్ణమిగానీ అడ్డురావు.
…. పూటకూళ్లింటి ముసలాయన

వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అ లాగే స్వప్న జగత్తులోని సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపివేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్లు, ఆమెలోని సకల సందిగ్ధతలనూ సకల సంశయాలనూ సకల జడత్వాలనూ కడిగివేశాయి.
… సినబ్బ

మునెమ్మ” రచయిత డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండిచ్చేరిలో ఎంబిబిఎస్‌ చేశాక నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో స్కిన్‌ స్పెషలిస్టుగా కుష్టు రోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

వీరి ఇతర రచనలు:

బానిసలు
భగవానువాచ
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌
స్మశానం దున్నేరు
అతడు అడవిని జయించాడు
రాముడుండాడు రాజ్జిముండాది
మూగవాని పిల్లనగ్రోవి
చివరి గుడిసె
సిటీ బ్యూటిఫుల్‌

Courtesy: http://hyderabadbooktrust.blogspot.in/2008/10/blog-post_04.html

పై రచనలన్నీ ఇప్పుడు బుక్ కనెక్ట్ ద్వారా ఫ్లిప్ కార్ట్ లో దొరుకుతున్నాయి – http://www.flipkart.com/author/dr-kesava-reddy

Twintro-Telugu-1-12th May 2012